సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్‌మెంట్! 16 d ago
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, మొత్తం 107 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులను అనుసరించి అభ్యర్ధుల వయసు 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు ఉంటుంది. కోర్ట్ మాస్టర్ పోస్టులకు డిగ్రీ (లా), 120 wpm వేగంతో షార్ట్ హ్యాండ్ (ఇంగ్లీష్), 40 wpm టైపింగ్ వేగంతో కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానముండాలి. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీతో పాటు 110 wpm వేగంతో షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లీష్), 40 wpm టైపింగ్ వేగంతో కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు 100 wpm వేగంతో షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లీష్), 40 wpm టైపింగ్ వేగంతో కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానముండాలి.
జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్ధులు రూ. 1000/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ఎక్స్ -సర్వీస్‌మెన్/పీహెచ్ అభ్యర్ధులకు/ స్వాతంత్య్ర సమరయోధుల అభ్యర్ధులకు ఫీజు రూ. 250/-. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 25. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.